అలర్ట్ : మరో నాలుగురోజుల పాటు వర్షాలు

బంగాళ ఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. అయితే మరో నాలుగు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నదుల్లో ప్రవాహం పెరిగింది. గాలులు, వర్షాలకు తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంది. వర్ష బీభత్సానికి కోస్తాంధ్రలో జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తాండవ రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయింది.

వరద ప్రవాహం పెరగడంతో అధికారులు తాండవ రిజర్వాయర్ గేట్లను ఎత్తివేశారు. నదీ పరివాహక ప్రాంతాలైన విశాఖ జిల్లా నాతవరం, తూర్పుగోదావరి జిల్లా అల్లిపుడి, కోట నందూరు, కుమ్మరిలోవా గ్రామాల మీదుగా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. కొన్ని గ్రామాల్లో గడ్డలపైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు అంటే తీవ్ర నష్టం తప్పకపోవచ్చని అంచన వేస్తున్నారు