ఆ రెండు బిల్లులకి ఏపీ గవర్నర్ ఆమోదం

సీఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. మూడు వారాల క్రితం ఈ రెండు బిల్లులను ప్రభుత్వం గవర్నర్ దగ్గరకు పంపించింది. ఈ బిల్లులపై న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ తాజాగా ఆమోద ముద్ర వేశారు. దీంతో.. ఏపీ రాజధాని తరలింపు ప్రక్రియ మొదలైపోనట్టయింది.

ఈ రెండు బిల్లులు ఆమోదం తెలపవద్దని అధికార వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు గవర్నర్ కు లేఖలు రాసిన విషయం తెలిసిందే. దీంతో గవర్నర్ న్యాయ సలహా తెలుసుకున్నారు. అనంతరం ఈ రెండు బిల్లులకి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.