చైనాతో సరిహద్దు వివాదంపై లోక్ సభలో పకటన

జూన్ 15వ తేదీన గాల్వన్ లోయలో 20 మంది భారతీయ సైనికులు చైనా దాడిలో చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన చర్చల్లో భాగంగా భారత్, చైనా బలగాలు వెనక్కి తగ్గాయి. అయితే ఇటీవల చైనా మరోసారి రెచ్చగొడుతోంది. సరిహద్దుల్లో సైనికులని మోహరించింది. తాజాగా చైనా దళాలు ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ వేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మరింత సీరియస్‌గా మారింది. దీనిపై ఇవాళ లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఇవాళ మధ్యాహ్నం లోక్‌సభ సమావేశం కానున్నది. సుమారు 3 గంటల ప్రాంతంలో రాజ్‌నాథ్‌.. చైనా వివాదంపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. వాస్తవాధీన రేఖ వెంట ఉన్న పరిస్థితిపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.