కూల్చివేతలు, కుట్రలతోనే వైసీపా పాలన

కూల్చివేతలు, కుట్రలతోనే వైసీపీ సర్కారు పాలన కొనసాగుతోందని విమర్శించారు టీడీపీ నేత చిన రాజప్ప. విశాఖలోని గీతం యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని కట్టడాలను అధికారులు కూల్చివేయడం పట్ల మండిపడ్డారు. గీతం వర్సిటీపై ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, కూల్చివేతలకు ముందు నోటీసులు ఇవ్వకపోవడం సరికాదని చెప్పారు.

గత అర్ధరాత్రి వాటిని కూల్చేయడానికి దాదాపు 200 మందితో వచ్చి కూల్చేశారని తెలిపారు. ఉన్నత విద్యా సంస్థలకు సాయం చేయకుండా, ఇటువంటి చర్యలకు పాల్పడడం సరికాదని తెలిపారు. కూల్చివేతలు, కుట్రలతోనే వైసీపీ సర్కారు పాలన కొనసాగుతోందని ఆయన చెప్పారు. జగన్ తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసమే ఇలాంటి దారుణ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.