రాజాసింగ్ కు ఫేస్ బుక్ షాక్

తెలంగాణ బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఫేస్ బుక్ షాక్ ఇచ్చింది. ఆయన ఫేస్ బుక్ ఖాతాని నిషేధించింది. ఎవరైనా ద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని తమ నిబంధనలు ఒప్పుకోవని తెలిపింది. హింసను ప్రేరేపించే వ్యాఖ్యలకు సంబంధించి తమ నిబంధనలను రాజాసింగ్ ఉల్లంఘించారని ఫేస్ బుక్ తెలిపింది.

మరోవైపు వారం క్రితమే రాజాసింగ్ ఓ వివరణ ఇచ్చారు. తనకు ఫేస్ బుక్ పేజ్ లేదని… తన పేరు మీదుగా అనేక మంది ఫేస్ బుక్ పేజీని నడుపుతున్నారని చెప్పారు. ఫేస్ బుక్ లో తన పేరు మీద వచ్చే ఏ పోస్టుకూ తాను బాధ్యుడిని కాదని ఆయన చెప్పారు. దీంతో రాజాసింగ్ ఫేక్ ఖాతాలపై నిషేధం విధించినట్టయింది.