ఈటీవీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రజనీ

సూపర్ స్టార్ రజనీకాంత్ ఆదివారం రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఈటీవీ భారత్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అన్ని భారతీయ భాషలతోపాటు ఇంగ్లీషులోనూ వార్తలందిస్తున్న ఈటీవీ భారత్‌ మొబైల్‌ యాప్‌ విశేషాలను రజనీకాంత్‌ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈటీవీ భారత్‌ 29 రాష్ట్రాల న్యూస్‌ డెస్క్‌లను ఆయన తిలకించారు.

దేశంలోనే అతిపెద్ద రిపోర్టింగ్‌ నెట్‌వర్క్‌ ఉన్న ఈటీవీ భారత్‌ యాప్‌ను సూపర్‌స్టార్‌ అభినందించారు. శివ దర్శకత్వంలో రజనీ కొత్త సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సందర్భంగా రజనీ ఈటీ భారత్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.