రకుల్ బికీనీ పోజు

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల్లో ల్యాండ్ అయింది. ఇలా వెళ్లడమే ఆలస్యం అలా బికినీ వేసి ఓ ఫొటో దిగి పోస్ట్ చేసింది. సముద్రం-వాసన, ఆకాశం-అనుభూతి, ఊహలు-రెక్కలు అంటూ ఓ కొటేషన్ కూడా తగిలించింది. లక్స్ సౌత్ యారి అనే ఫైర్ స్టార్ రిసార్ట్ లో ప్రస్తుతం సేదతీరుతోంది రకుల్.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఒకేసారి 2 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చింది. క్రిష్ దర్శకత్వంలో అడవుల్లో ఓ సినిమా షూటింగ్ పూర్తిచేసింది. ఆ తర్వాత నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చెక్ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసింది.

Spread the love