‘రంగ్ దే’ లిరికల్‌ వీడియో.. ముహూర్తం ఫిక్స్ !

వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్-కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ఈ చిత్రానికి మ్యూజిక్‌ సెన్సేషన్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌ని చిత్రయూనిట్‌ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఈ పాటకు సంబంధించిన లిరికల్‌ వీడియో సాంగ్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసేందుకు సిద్ధమైన తరుణంలో చిత్ర సమర్పకుడైన పి.డి.వి. ప్రసాద్‌ భార్య అంజు ప్రసాద్‌ గుండెపోటు మృతిచెందారు.

ఆమె మృతి కారణంగా ఈ లిరికల్‌ వీడియో సాంగ్‌ విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా చిత్రయూనిట్‌ తెలిపింది. తాజాగా ఈ లిరికల్‌ వీడియో విడుదలకు సంబంధించిన న్యూ డేట్‌ని చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ లిరికల్‌ వీడియో సాంగ్‌ని 12 నవంబర్, సాయంత్రం 4గంటల 05 నిమిషాలకు విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా తెలియజేసింది.