రెండు పెద్ద చిత్రాల్లో రాశీ

సీనియర్ హీరోయిన్ రాశీ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. తాజాగా దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. మంచి కథ, మనసుకు నచ్చిన పాత్ర ఉన్న చిత్రాల్నే చేస్తున్నా. తెలుగులో రెండు పెద్ద సినిమాలు చేస్తా. త్వరలోనే వాటిపై అధికారిక ప్రకటన వస్తుంది. ప్రస్తుతం తమిళ్‌, తెలుగులో రెండు చిత్రాలు చేస్తున్నా. దీంతో పాటు మా భర్త శ్రీముని దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్‌ చేస్తున్నానని రాశీ తెలిపింది.

‘మమతల కోవెల’ చిత్రంతో బాలనటిగా తెలుగు తెరపై అడుగుపెట్టి.. ‘గోకులంలో సీత’, ‘అమ్మో, ఒకటో తారీఖు’, ‘పెళ్లి పందిరి’, ‘ప్రేయసి రావే’ ‘మనసిచ్చి చూడు’, ‘దేవుళ్లు’ వంటి పలు హిట్‌ చిత్రాలతో తెలుగు తెరపై అగ్ర కథానాయికగా మెరిసింది.