12 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం

నిరుద్యోగులకి కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గుడ్ న్యూస్ చెప్పారు. రానున్న ఐదేళ్లలో 12లక్షల ఉద్యోగాలు కలిపిస్తామన్నారు. పలు అంతర్జాతీయ సంస్థలతో సహా మొత్తం 22 కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు. ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (పీఎల్‌ఐ) కింద దేశంలో రాబోయే ఐదేళ్లలో11 లక్షలకు కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ విడిభాగాలు తయారు కానున్నాయని తెలిపారు.

పెగాట్రాన్, శాంసంగ్ , రైజింగ్ స్టార్ , ఫాక్స్ కాన్, విస్ట్రాన్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్ల కూడా ఉన్నాయని.. వీటితో పాటు మరిన్న సంస్థలు ఈ పథకంలో భాగం కానున్నయని అన్నారు. మొత్త 22 కంపెనీలు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నాయని చెప్పారు. ఈ కంపెనీలతో 12లక్షల ఉద్యోగాలు లభిస్తామయని చెప్పారు.