అజిత్ తో బాలయ్య డైరెక్టర్..

రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ తో రూలర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సీనియర్ దర్శకుడు కే ఎస్ రవికుమార్ తాజాగా మెగా ఆఫర్ దక్కించుకున్నట్లు తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తో ఓ మూవీ చేసే అవకాశం దక్కించుకున్నారని సమాచారం.

సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వచ్చే ఆగస్టు నుండి సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది. అజిత్-రవి కుమార్ 2006లో వచ్చిన వారలారు చిత్రానికి పని చేశారు.