రవితేజ క్రాక్ తెప్పిస్తాడట…

డిస్కో రాజా చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ రవితేజ..ప్రస్తుతం తన 66 వ చిత్రం క్రాక్ లో నటిస్తున్నాడు. బలుపు , డాన్ శ్రీను చిత్రాల ఫేమ్ గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి డైరెక్ట్ చేస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా..ఈ చిత్రం తాలూకా విశేషాలు బయటకొస్తూ అంచనాలు పెంచేస్తున్నాయి.

ఈ మూవీ లో రవితేజ పాత్ర నిజంగానే క్రాక్ అనేలా ఉంటుందట. ఒకరకంగా చెప్పాలంటే ‘కిక్’ సినిమాలో రవితేజ తరహా పాత్రలా ఉంటుందట. అంటే ఫుల్ ఎనర్జీతో కథను ఆద్యంతం రక్తికట్టించేలా ఆయన పెర్ఫార్మెన్స్ ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్ , వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా..ఠాగూర్ బి మధు నిర్మిస్తున్నారు.