మారటోరియం మరో మూడు నెలలు పొడగింపు

ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. మారటోరియం ని మరో మూడు నెలలు పొడగిస్తున్నట్టు భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. శుక్రవారం దాస్ మీడియాతో మాట్లాడారు. రెపో రేట్‌ను 40 బేసిస్ పాయింట్లకు తగ్గించారు. ఇప్పుడున్న 4.4 శాతం నుంచి రెపో రేట్ 4 శాతానికి తగ్గుతుందని తెలిపారు. రివర్స్ రెపో రేట్ కూడా 3.35 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

రెండు నెలల వ్యవధిలో ఇది ఆర్బీఐ ఏర్పాటు చేసిన మూడో మీడియా సమావేశం. మొదటిసారి లాక్‌డౌన్ విధించినప్పుడు మార్చి 27న మూడు నెలల మారటోరియం ప్రకటించాం. లాక్ డౌన్ పొడిగించడంతో ఇప్పుడు దాన్ని దాన్ని మరో మూడు నెలలు అంటే ఆగస్టు 31 వరకూ పొడిగిస్తున్నామని దాస్ తెలిపారు.