ఆ ముగ్గురిపై ఆర్సీబీ గురి

ఐపీఎల్13 ఇటీవలే ముగిసింది. మరో ఐదారు నెలల్లోనే ఐపీఎల్ 14 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే కీలక ఆటగాళ్లని దక్కుంచుకునేందుకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ప్రయత్నాలు మొదలెట్టింది. రాజస్థాన్ రాయల్స్ నుండి ఓషనే థామస్, రాజస్థాన్ రాయల్స్ నుండి డేవిడ్ మిల్లెర్, ముంబై ఇండియన్స్‌ కు చెందిన క్రిస్ లిన్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

బ్యాటింగ్ విభాగంలో ఎక్కువగా దృష్టి సారించింది. ఈ నేపధ్యంలోనే కీలక ఆటగాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఆర్‌సిబి బ్యాటింగ్ విరాట్ కోహ్లీ, అబ్ డివిలియర్స్‌పై ఎక్కువగా ఆధారపడింది. కాబట్టి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసారు. టీమిండియా అద్భుత విజయాలు అందిస్తున్న విరాట్ కోహ్లీ.. ఆర్ సీబీకి మాత్రం కప్ ని తేలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై విమర్శలొస్తున్నాయ్. అందుకే ఈ సారి పటిష్టమైన జట్టుకోసం విరాట్ ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది.

Spread the love