రికవరీ పెరుగుతోంది.. కానీ !

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రికవరీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 44,059 వైరస్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 91,39,866కు పెరిగింది. ఇదే సమయంలో 41,024 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 85,62,641కు చేరింది.

రికవరీ రేటు 93.68శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 4,43,486 యాక్టివ్‌ కేసులు ఉండగా.. క్రియాశీల రేటు 4.85శాతంగా ఉంది. ఇక గత 24 గంటల్లో మరో 511 మంది కొవిడ్‌కు బలయ్యారు. దీంతో దేశంలో వైరస్‌ మృతుల సంఖ్య 1,33,738కు పెరగ్గా.. మరణాల రేటు 1.46శాతంగా ఉంది. ఆదివారం 8,49,596మంది కరోనా టెస్టులు చేశారు. మరోవైపు దేశంలోని పలు చోట్ల కరోనా సెకండ్ వేవ్ మొదలైందని చెబుతున్నారు. సెకండ్ వేవ్ అంటే సునామీనేనని నిపుణులు చెబుతున్నారు.

Spread the love