టిమ్స్ ని ఎందుకు ప్రారంభించడం లేదు ?

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర ప్రభుత్వంపై హత్యానేరం కింద కేసు పెట్టాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. టిమ్స్‌ ఆస్పత్రిని ఎందుకు ప్రారంభించడం లేదు? అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు అంటే ప్రభుత్వానికి లెక్కలేదని, వైద్యులకు కూడా కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు.

సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్లు పెట్టి గొప్పలు చెప్పుకున్నారు.. కానీ చేసింది శూన్యం. ఎక్కువగా కరోనా టెస్ట్‌లు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. వైద్య సిబ్బందిని ఎందుకు నియమించడం లేదు? అని రేవంత్‌ ప్రశ్నించారు. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.