పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ.. రేవంత్ స్పందన

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవికి తెరాస పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. పీవీ కుటుంబానికి కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఓడిపోయే సీటు పీవీ కుమార్తెకా? అని ప్రశ్నించారు. ఆమెను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేయొచ్చు కదా! అని అన్నారు. కేసీఆర్ కుట్రను పీవీ కుమార్తె తెలుసుకోవాలని సూచించారు. రాజకీయ లబ్ది కోసమే పీవీ కుమార్తెను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారని కాంగ్రెస్ నేతలు ఆరొపిపిస్తున్నారు.

Spread the love