రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన బీజేపీ

దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల తర్వాత తెలంగాణ భాజాపాలో ఊపొచ్చింది. పలువురు కాంగ్రెస్, తెరాస నేతలు భాజాపాలో చేరుతున్నారు. అయితే భాజాపా వ్యూహాత్మకంగా ఎంపీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసింది. ఆయన్ని సన్నిహితులని పార్టీలో చేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే నాయకులను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది.

కొద్దిరోజుల క్రితం కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న కూన శ్రీశైలం గౌడ్ బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలోకి వెళతారని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే.. కాంగ్రెస్ తరపున పోటీ చేయబోయే ఆయనకు టికెట్ సహా ఇతర ఇబ్బందులు లేవు. అయితే తెలంగాణలో బీజేపీ బలపడుతుండటంతో ఆయన ఈ రకమైన నిర్ణయం తీసుకుని ఉంటారనే ప్రచారం జరుగుతోంది.

Spread the love