ఏపీ రాజధానిపై రేవంత్ కామెంట్

రాజధాని అంశం ఏపీ రాజకీయాలని హీటెకిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని భూములిచ్చిన రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత 26రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు, ఏపీకి మూడు రాజధానులకి అనుకూలంగా కొందరు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజధానిపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కుప్పకూలే పరిస్థితిలో ఉందన్నారు రేవంత్. ఏపీ రాజధాని పరిణామాలపై తెలంగాణ వ్యక్తిగా సంతోషంగా.. భారతీయ పౌరుడిగా బాధగా ఉందని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితుల ప్రభావంతో హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం పెరిగిందని చెప్పారు. ఏపీ కుప్పకూలే పరిస్థితి వల్ల తెలంగాణకే లాభం చేకూరుతుందన్నారు. రేవంత్ రెడ్డి ఫక్తు ఏపీ తెదేపా నేత మాటల్లా ఉన్నాయని ఆయన ప్రత్యర్థి వర్గం గుసగుసలాడుకుంటుంది.