తెలంగాణ హైకోర్టు కూల్చివేత.. సుప్రీం ఆశ్రయించిన రేవంత్

తెలంగాణ పాత సచివాలయాన్ని కూల్చేసి.. ఆ స్థానంలో కొత్త సచివాలయాన్ని నిర్మించే పనిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించారు.

సచివాలయం కూల్చివేతతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఆయన అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. సచివాలయం కూల్చివేతపై ఇప్పటికే జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)కూ రేవంత్‌ పిర్యాదు చేశారు. ఇటీవల నగరానికి వచ్చిన ఎన్జీటీ బృందాన్ని ఆయన కలిశారు. కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు పలు శాఖలు ఇచ్చిన అనుమతులు సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని కమిటీకి వివరించారు.