బాబు బాబాగా మారిపోయారా ?

నితిన్-షాలినీ వివాహం రేపు హైదరాబాద్ లోని ఫలక్ నూమా ప్యాలెస్ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఐదు రోజుల పెళ్లి వేడుక నిర్వహిస్తున్నారు. శుక్రవారం నితిన్‌ను పెళ్లికొడుకుగా ముస్తాబు చేశారు. ఈ వేడుకలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. తన మిత్రుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నిర్మాత రాధాకృష్ణతో కలిసి శుక్రవారం ఆయన ఈ వేడుకలో పాల్గొన్నారు.

చాతుర్మాస్య దీక్షలో ఉన్న పవన్.. దానికి సంబంధించిన డ్రెస్ లోనే వచ్చేశారు. దాదాపుగా బాబా గెటప్ లో పవన్ కనిపించారు. పవన్ లుక్ పై వర్మ సైటర్స్ వేశారు. బాబు బాబాగా మారిపోయారా ?” అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత కేవలం పవన్ ఫోటో పోస్ట్ చేసిన వర్మ ”నేను మాములుగా బాబులను బాబాలను నమ్మను. కానీ ఈ బాబు బాబాను మాత్రం నేను నమ్ముతున్నాను. నాకు మీ ఆశీర్వాదం కావాలి అని ట్వీట్ చేశాడు.