చిట్యాలలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి !

ఓ వైపు కరోనా వణికిస్తోంది. మరోవైపు తుఫాన్, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలోని చిట్యాల సమీపంలో హైవేపై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.