ఆసీస్ టెస్ట్ సిరీస్ కు రోహిత్ దూరం ?

ఐపీఎల్-13 లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ ని ఆసీస్ తో వన్ డే, టీ20 సిరీస్ కి సెలక్ట్ చేయలేదు. అయితే టెస్ట్ సిరీస్ కు మాత్ర రోహిత్ ని ఎంపిక చేశారు. అదే సమయంలో కెప్టెన్ కోహ్లీకి సెలవులు ఇచ్చారు. అయితే రోహిత్ టెస్ట్ సిరీస్ కూడా దూరం కానున్నాడని సమాచారమ్.

తొలి రెండు టెస్టులకు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, బౌలర్ ఇషాంత్ శర్మ దూరం కానున్నారని తెలుస్తోంది. చివరి రెండు టెస్టులకు కూడా వీరిద్దరు ఆడటం అనుమానమే అని సమాచారం. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌కు రోహిత్‌, ఇషాంత్ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే గాయపడిన వీరిద్దరు ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో కోలుకుంటున్నారు.

Spread the love