పవన్’పై రోజా ఫైర్ 

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. పవన్‌కల్యాణ్ హైదరాబాద్‌లో అమ్ముడుపోయి.. తిరుపతి సీటు కోసం ఢిల్లీలో కాసుకు కూర్చున్నారని విమర్శించారు. ఎవరైనా పార్టీ పెట్టారంటే సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్తారు. గానీ.. వేరే పార్టీలకు ఓటేయమని అడగడమేంటి? అని ప్రశ్నించారు.

జనసేన పార్టీ స్థాపించినప్పుడు బీజేపీ, టీడీపీతో వెళ్లారు.. ఇప్పుడేమో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తప్పుకుని తిరుపతి సీటు కోసం మాట్లాడుతున్నారన్నారు. గ్రేటర్‌లో కేసీఆర్ గెలవకూడదంట.. ఇదేంటో అర్థం కావడం లేదన్నారు. గ్రేటర్‌లో ఎవరిని గెలిపించాలో అక్కడ ప్రజలు నిర్ణయించుకుంటారని చెప్పారు. వీళ్ల క్యారెక్టర్ ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు.

Spread the love