మూస పద్దతికి స్వస్థి చెప్పాల్సిందే : కేసీఆర్

తెలంగాణలో నడుసున్నది రైతు ప్రభుత్వం. సీఎం కేసీఆర్ ఉన్నంతకాలం రైతులకి ఎలాంటి బాధలు ఉండవని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్ తీసుకురావాలని భావిస్తున్న నియంత్రిత సాగుపై మాత్రం రైతుల్లో అనుమానాలున్నాయి. వాటిని తొలగించే ప్రయత్నం చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు అనే అంశంపై మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో సీఎం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు రైతులు మూసపద్ధతిలో వ్యవసాయం చేయడం ద్వారా ఎంతో నష్టపోయాం. ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, నేల రకాలను పరిగణనలోకి తీసుకుని ఏ సీజన్ లో ఏ పంట పండించాలి, ఏ ప్రాంతంలో ఏ పంటలు వేయాలనే విషయాలను శాస్త్రవేత్తలు నిర్ణయించాలన్నారు. ఏ పంటకు మార్కెట్లో డిమాండ్ ఉందో అగ్రిబిజినెస్ డిపార్ట్ మెంట్ అధికారులు గుర్తించారని, ఈ మేరకు రైతులకు ప్రభుత్వం తగిన సూచనలు చేస్తుందన్నారు.