మరో రికార్డు కొట్టిన ‘రౌడీ బేబీ’


తమిళ హీరో ధనుష్, హోమ్లీ హీరోయిన్ సాయిపల్లవి కలసి నటించిన చిత్రం ‘మారి 2’. బాలాజీ మోహన్ దర్శకత్వంలో రెండేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులోని ‘రౌడీ బేబీ’ పాట సూపర్ డూపర్ హిట్టయింది. ధనుష్, సాయిపల్లవిల డ్యాన్స్ కు ప్రేక్షకులు మత్తెక్కి ఊగిపోయారు. అంతలా ఈ పాట ప్రేక్షకులకు పట్టేసింది. దీంతో యూ ట్యూబ్ లో ఇది నేటికి 100 కోట్ల (బిలియన్) వ్యూస్ ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది.

ఈ సందర్భంగా హీరో ధనుష్ ఈ రోజు ట్వీట్ చేస్తూ, ‘కొలవరి డీ పాట వార్షికోత్సవం రోజునే రౌడీ బేబీ పాట బిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం ఒక మధురమైన కాకతాళీయంగా చెప్పుకోవాలి. బిలియన్ వ్యూస్ ను పొందిన తొలి దక్షిణాది పాటగా దీనికి గుర్తింపు రావడాన్ని గౌరవంగా భావిస్తున్నాం. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ పేర్కొన్నాడు.

Spread the love