తెవాటియా, పరాగ్ మెరుపులు.. రాజస్థాన్ విజయం !

ఐపీఎల్ లో భాగంగా దుబయ్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో స్మిత్ సేన గెలుపొందింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్ మెరుపులతో రాజస్థాన్ జట్టు లక్ష్యాన్ని చేధించింది.

159 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ మొదట్లోనే తడబదింది. అయితే తెవాటియా 28 బంతుల్లో 45 (4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రియాన్ పరాగ్ 26 బంతుల్లో 42 (2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రన్స్ చేశారు. సంజు శాంసన్ 26 పరుగులు చేసి పరవా లేదనిపించాడు. బెన్ స్టోక్స్ 5, బట్లర్ 16, స్మిత్ 5, ఊతప్ప 18 రన్స్ మాత్రమే సాధించారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమైనప్పటికీ మిడిలార్డర్‌లో వచ్చిన తెవాటియా, పరాగ్ అద్భుతంగా రాణిచండంతో.. స్మిత్ సేన విజయం సాధించింది.