జగన్ రఘు రామకృష్ణ రాజు మరో లేఖ

నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు సీఎం జగన్ కి మరో లేఖ రాశారు. ఈ సారి అయోధ్యలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన నేపథ్యంలో ఏపీలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలి కోరారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరిగే రోజు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలి. దేవాదాయశాఖ పరిధిలోని 24వేల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పఠనం చేయాలి. భూమిపూజ కార్యక్రమాన్ని తితిదే ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని లేఖలో కోరారు.