ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్..అదిరింది అనే మాట చాల తక్కువే…

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా ..బాలీవుడ్ భామ అలియా , అజయ్ దేవగన్ తో పాటు హాలీవుడ్ ప్రముఖ నటి నటులు నటిస్తుండడం తో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఫై ఆసక్తి నెలకొని ఉంది. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ బ్రేక్ పడింది. ఇదిలా ఉంటె తాజాగా ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ ఉగాది కానుకగా విడుదల చేసి ఆకట్టుకున్నారు.

ఈ సినిమాకు రౌద్రం-ర‌ణం-రుధిరం అనే టైటిల్‌ను ఖ‌రారును చేయ‌డంతో పాటు మోష‌న్‌పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ‘జ‌లం అగ్నిని ఆర్పుతుంది. అదే అగ్ని జ‌లాన్ని ఆవిరి చేస్తుంది. ఈ రెండు బ‌లాలు క‌లిసి ఓ మ‌హాశ‌క్తిగా మీ ముందుకు వ‌స్తున్నాయి’..అంటూ రాజ‌మౌళి చెప్పుకొచ్చారు.

ఈ మోష‌న్ పోస్ట‌ర్‌లో ఎన్టీఆర్ ను జ‌లానికి, రామ్‌చ‌ర‌ణ్ ను అగ్నికి ప్ర‌తీక‌లా చూపించారు. ఆర్‌.ఆర్‌.ఆర్‌. ఇంగ్లీష్ టైటిల్‌కు రైజ్‌-రివోల్ట్‌-రోర్ అంటూ క్యాప్ష‌న్ పెట్టారు. దాదాపు 400కోట్ల భారీ వ్య‌యంతో నిర్మాత డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అలియాభ‌ట్‌, ఒలివియా మోర్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు అజ‌య్‌దేవ్‌గ‌ణ్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను పోషిస్తున్నార‌ని స‌మాచారం. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు.