RRR+R’ స్ట్రాంగ్ వార్నింగ్ !

వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుతో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలిశారు. ఆయన ఒక ఫోటో తీసి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా దానిని షేర్ చేశారు. అంతే కాదు షేర్ చేయడంతో పాటు ఆర్ ఆర్ ఆర్ అంటే రఘురామకృష్ణంరాజు ప్లస్ ఆర్ అంటే రాంగోపాల్ వర్మ కలిస్తే బస్తీమే సవాల్ అర్థం వచ్చేలా ఒక ట్వీట్ పెట్టారు.

అలాగే ఈ ఫోటోలో వీళ్ళిద్దరూ ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్టు వేలు చూపించడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రఘురామకృష్ణతో కలిసి వర్మ ఏం ప్లాన్ చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు. కొంపతీసి యూటర్న్ తీసుకొని వర్మ.. జగన్ ని తగులుకోబోతున్నారా ? ఆర్ ఆర్ ఆర్ రెబల్ అంటూ ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నాడా ? అని చెప్పుకొంటున్నారు.