జగన్ ఢిల్లీ టూర్ ఎఫెక్ట్ … ఏపీకి రూ. 178కోట్ల నిధులు విడుదల !

ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.178 కోట్లు నిధులు విడుదల చేసింది. ఉపాధి హామీ పథకానికి సంబంధించి నిధులివి. ఉపాధి హామీ కూలీల వేతనాల కోసం ఈ ఏడాది రూ.4,333.9 కోట్లు కేంద్రం మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా రూ. 178కోట్లని విడుదల చేసింది. ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఉపాధి హామీ వేతనాలకు నిధులు విడుదల చేశారు.

ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ లో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. సీఎం జగన్ కి వెళ్లిన సమయంలోనే కేంద్రం నుంచి రూ. 178కోట్లు విడుదలకావడంతో.. ఇది సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఎఫెక్ట్ అని వైకాపా నేతలు చక్కలు గుద్దుకుంటున్నారు.