భారీ వర్షాలు : మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం

భారీ వర్షాలు, వరద ప్రభావంపై సీఎం కేసీఅర్ అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల పరంగా జరిగిన నష్టాన్ని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫున ప్రతి ఇంటికి ఆహారం, 3 దుప్పట్లు వెంటనే అందించాలని కేసీఆర్‌ ఆదేశించారు. హైదరాబాద్‌ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం రూ.5కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆయన నిర్ణయించారు.

మరోవైపు వరదల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని.. ఇల్లు పూర్తిగా కూలిపోయినన వారికి కొత్తగా మంజూరు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు ఆర్థికసాయం అందించాలని సూచించారు.