లోన్ యాప్ నిర్వాహకుల అరెస్ట్

దా’రుణ’ యాప్ లోన్లకు ఇటీవల పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లోన్ వేధింపులు తాళలేక బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఆత్మహత్యలు పెరిగిపోవడంతో పోలీసులు అప్రమత్తమై యాప్ లోన్ నిర్వాహకుల భరతం పడుతున్నారు. తాజాగా హైదారాబాద్ లో యాప్ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇద్దరు నిర్వాహకులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. చైనా దేశస్తుడితో పాటు ముంబైకి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ముంబైలో లోన్ యాప్ సంస్థ కాల్‌సెంటర్ నిర్వహిస్తోంది. నిందితుల బ్యాంక్ అంకౌంట్‌లో రూ.28 కోట్లు పోలీసులు ఫ్రీజ్ చేశారు. మరోవైపు ఆన్ లైన్ లోన్ విషయంలో ప్రజలని అప్రమత్తం చేస్తున్నారు.

Spread the love