సుబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొన్న లోకేష్

కడప జిల్లా టీడీపీ నేత నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఉదయం సుబ్బయ్యకు అంత్యక్రియలు జరిగాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

దీనిపై నారా లోకేష్ ట్వీట్ చేశారు. సుబ్బయ్య అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి నివాళి అర్పించానని వెల్లడించారు. బాధిత కుటుంబాన్ని, సాక్షులను ప్రలోభపెట్టినా, వారికి ఏం జరిగినా వైఎస్ జగన్ దే బాధ్యత అని స్పష్టం చేశారు. పోలీసులు హామీ ఇచ్చిన మేరకు న్యాయం జరగకపోతే మళ్లీ ప్రొద్దుటూరుకు వస్తా… మళ్లీ దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

Spread the love