స్కూల్స్ రీఓపెన్.. గైడ్ లైన్స్ విడుదల !

ఫిబ్రవరి 1న విద్యా సంస్థలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన నేపథ్యంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్, సాంకేతిక, కళాశాల విద్యాశాఖల కమిషనర్ ననీన్ మిత్తల్, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు.

ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల నిర్వహణకు తరగతుల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఈ నెల 20లోగా నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల్లో భోజన సదుపాయాల ఏర్పాటుకుగానూ బియ్యం, పప్పు, ఇతర ఆహార ధాన్యాలను జిల్లా కలెక్టర్లు సమకూరుస్తారని మంత్రి తెలిపారు. జిల్లా, మండల విద్యాధికారులు అన్ని పాఠశాలలను ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన చర్యలను చేపట్టాలన్నారు.

Spread the love