సెహ్వాగ్ కొడుకుపై సచిన్ ప్రశంసలు


టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రెచ్చిపోతే ఎట్టుట్టదో తెలిసిందే. ఇప్పుడు ఆయన ఇద్దరు తనయులని కూడా తన మాదిరే మంచి క్రికెటర్స్ గా రెడీ చేసే పనిలో ఉన్నారు. సెహ్వాగ్ కొడుకులు ఆర్యవీర్ సెహ్వాగ్ (Aryaveer Sehwag), వేదాంత్ సెహ్వాగ్ (Vedant Sehwag) తండ్రిలాగే క్రికెటర్ కావాలని సన్నాహాలు మొదలు పెట్టేశారు.

పాఠశాల క్రికెట్ జట్టులో ఆడే ఆర్యవీర్, వేదాంతలు తమ ఫిట్‌నెస్ శిక్షణ, బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం అలవాటు చేసుకున్నారు. దీంతో నెటిజన్లు ఈ బుడతల క్రికెట్ స్కిల్స్ చూసి షాక్ తింటున్నారు. ఈ మధ్య కాలంలోనే సచిన్ టెండూల్కర్ నెట్ ప్రాక్టీస్ సమయంలో ఆర్యవీర్‌కు బౌలింగ్ వేసిన క్లిప్ వైరల్ అయ్యింది. సచిన్ స్పిన్ బౌలింగ్‌లో, ఆర్యవీర్ అద్భుతమైన షాట్ ఆడగా, మాస్టర్ బ్లాస్టర్ కూడా యువ బ్యాట్స్‌మన్‌ను ప్రశంసించాడు.