సచిన్’కు మ్యారేజ్ డే గిఫ్ట్

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సోమవారం తన 25వ పెళ్లిరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సచిన్ కుటుంబ సభ్యులకి స్పెషల్ గిఫ్ట్ అందజేశారు. తన స్వహస్తాలతో ఆయన కుటుంబసభ్యుల కోసం మ్యాంగో కుల్ఫీ తయారు చేశారు.అందుకు సంబంధించిన వీడియోని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

అంతేకాదు.. మ్యాంగో కుల్ఫీ ఎలా చేయాలో కూడా సచిన్ వివరించారు. ‘అద్భుతంగా ఉంది.. ఇంకా తినాలని ఉంది కానీ, వారి కోసం దాచి ఉంచుతాను. అందరం కలిసి తింటాము” అని తెలిపారు. 1995 సంవత్సరంలో సచిన్ అంజలిని వివాహమాడారు.