ఆర్‌బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. దేశంలోని అన్ని సహకార బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో 1,482 అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకులు, 58 మల్టీ స్టేట్‌ కోపరేటివ్‌ బ్యాంకులు ఇక ఆర్‌బీఐ పరిధిలోకి రానున్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. దీని వలన ప్రజలకి మేలా ? లేక ప్రభుత్వానికి మేలా ? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు, కరోనా ఎఫెక్ట్ తో ఏటీఎం విత్ డ్రా ఛార్జీలని పెంచే యోచనలో ఆర్బీఐ ఉన్నట్టు తెలుస్తోంది.