పంచాయతీల గెలుపు.. సజ్జాల సవాల్ !

ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయ్. అయినా.. రాజకీయ హీటు చల్లారడం లేదు. దీనికి కారణం.. పంచాయతీ స్థానాలు గెలుపు స్థానాల ప్రకటనలో తేడానే. తామే ఎక్కువ స్థానాలు గెలిచామని వైసీపీ.. కాదు కాదు.. వైసీపీ ఇలాకలోనూ తెదేపా పాగా వేసిందని ఆ పార్టీ ప్రకటించుకుంటున్నాయ్. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

చంద్రబాబు గారూ, ఇంకా అబద్ధాలు చెప్పడం ఎందుకని ప్రశ్నించారు. తప్పుడు ప్రకటనలు చేయడమేంటని నిలదీశారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు ఎక్కడెక్కడ గెలిచారో వారి ఫొటోలతో సహా జాబితాలు వెబ్ సైట్లో (ysrcppolls.in) విడుదల చేశామని తెలిపారు. మరి, టీడీపీ వాళ్లు ఎక్కడెక్కడ గెలిచారో ఫొటోలు సహా జాబితాలు విడుదల చేయగలరా? అంటూ చంద్రబాబుకు సజ్జల సవాల్ విసిరారు. మరీ.. దీనికి బాబు ఓకే చెబుతాడా ? అన్నది చూడాలి.

Spread the love