బంటుగా సల్మాన్..?

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అల వైకుంఠపురం లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. అన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసి అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవడం తో అన్ని భాషల వారు ఈ సినిమాను రీమేక్ చేయాలనీ చూస్తున్నారు. ముందుగా బాలీవుడ్ వారు అల ని రీమేక్ చేయబోతున్నారు.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చెయ్యాలని చూస్తున్నారు అక్కడి నిర్మాతలు. అయితే అల వైకుంఠపురములో రీమేక్ రైట్స్ ని 8 కోట్లకి అశ్విన్ వర్థే కొనగా. హిందీ రీమేక్‌లో సల్మాన్ ఖాన్‌తో పాటు మరో క్రేజీ బాలీవుడ్ హీరోను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. మరి సల్మాన్ ఈ సినిమా చేస్తాడా..లేదా అనేది చూడాలి.