అర్జున్ రెడ్డికి దిశ సెగ

దిశ అత్యాచార ఘటన యావద్దేశాన్ని షాక్ కు గురిచేసింది. అయితే దీనిపై దర్శకుడు సందీప్ వంగా చేసిన ట్వీట్ విమర్శలకు తావిచ్చింది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా “భయం అనేది కొత్త రూల్ గా ఉండాలి. భయం అనేది ఉంటేనే మన సమాజంలోని పరిస్థితుల్లో మార్పు వస్తుంది. క్రూరమైన శిక్షలు వేస్తేనే దారికి వస్తారు. ఈ దేశంలోని ప్రతి ఒక్క అమ్మాయికి ఓ గ్యారెంటీ కావాలి. వరంగల్ పోలీసులను రంగంలోకి దిగవలసిందిగా నేను కోరుతున్నాను” అంటూ తన స్పందన తెలిపాడు వంగా. అయితే ఊహించని కోణంలో సందీప్ ట్వీట్ కు విమర్శలు వచ్చి పడ్డాయి.

”అర్జున్ రెడ్డి.. కబీర్ సింగ్ లాంటి సినిమాలు తీస్తూ ఇప్పుడేమో ‘భయం’ గురించి చెప్తున్నావు. ఇది సరి కాదు. – అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు తీసి పురుషాధిక్య భావనలు పెరిగేలా చేస్తావు.. ఇప్పుడేమో రూల్స్ గురించి క్లాసులు ఇస్తావు. ఇదంతా హిపోక్రసీ. ” అని మండిపడుతున్నారు