మరో కరోనా వారియర్ మృతి

కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన విధులు నిర్వహిస్తున్నారు వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు. అయితే కరోనా వారియర్స్ కూడా కరోనా కాటుకి బలవ్వడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌ సీనియర్‌ ఉద్యోగి కరోనాతో మృతిచెందారు.

ఎయిమ్స్‌ ఔట్‌డోర్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో శానిటేషన్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న 58 ఏండ్ల వ్యక్తి ఈ నెల 16న కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే నెగెటివ్‌ రావడంతో వైద్యులు అతనికి కౌన్సెలింగ్‌ చేసి పంపించారు. కాగా, మే 19న ఆరోగ్యం క్షీణించడంతో శ్వాస సంబంధిత విభాగంలో చేరారు. పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. పరిస్థితి విషమించడంతో ఆదివారం నుంచి వెంటీలేటర్‌ సహాయంతో చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆయన మృతి చెందారు.