క్యాన్సర్ నుంచి కోలుకున్న సంజయ్

కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా తాను కరోనా నుంచి కోలుకున్నానని ఆయన తెలిపారు. ‘గత కొన్ని వారాలుగా నాకు, నా కుటుంబ సభ్యులకు కఠినమైన కాలమని చెప్పాలి. బలమైన వాళ్లకే భగవంతుడు కఠినమైన పోరాటాలను అప్పజెబుతాడని పెద్దలు అన్నట్టుగానే, నాకూ జరిగింది. ఈ రోజు మా పిల్లల బర్త్ డే సందర్భంగా.. కేన్సర్ పై పోరాటంలో నేను విజయం సాధించానని చెప్పడానికి ఆనందంగా వుంది.

నేను పూర్తి ఆరోగ్యవంతుడినై తిరిగి రావడం అనే కానుకను పిల్లలకు ఇస్తున్నందుకు మరింత సంతోషంగా వుంది. మీ అందరి ఆశీస్సులు, మద్దతు లేకపోతే ఇది నాకు సాధ్యమయ్యేది కాదు. ఈ కష్ట కాలంలో నాకు అండగా నిలిచి, శక్తిపొందడానికి బాసటగా నిలిచిన నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు ఎప్పటికీ కృతజ్ఞుడనై వుంటాను. ఈ సందర్భంగా నాకు అత్యుత్తమ వైద్య సేవలు అందించిన డాక్టర్ సేవంతి, ఆమె బృందానికి, కోకిలా బెన్ ఆసుపత్రి నర్సులకు, సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అంటూ సంజయ్ ట్విట్ చేశారు.