ఉత్తమ్ బొత్తిగా టైమింగ్ లేదుగా.. !

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకి సంక్రాంతి శుభాంక్షలు తెలిపారు. సంక్రాంతి శోభ పల్లెల్లో వెల్లివిరియాలన్నారు. పండగలను సంప్రదాయ పద్ధతిలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. పండగ శుభాకాంక్షలు తెలిపిన సందర్భంలోనూ ఉత్తమ్ రాజకీయ ఆరోపణలని వదల్లేదు.

మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో విఫలమైందని ఆరోపించారు. మున్సిపాలిటీల్లో రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని, టీఆర్ఎస్ ను ప్రజలు ‘ఛీ’ కొడుతున్నారని విమర్శించారు. ఇక మున్సిపల్ ఎన్నికల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడి కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు మొదలెట్టిన సమాచారమ్.