గాడ్సే’గా సత్యదేవ్ ఫస్ట్ లుక్

యంగ్ హీరో సత్యదేవ్ వైవిధ్యమైన పాత్రలో ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అనే డిఫరెంట్ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు చిరంజీవి చేస్తున్న లూసిఫర్ రీమేక్‌లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. విలన్‌గా లేదంటే సీఎం పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. సత్యదేవ్-గోపి గణేష్ కాంబో ఇప్పుడు గాడ్సేతో వచ్చేందుకు సిద్దమైంది.

సత్యదేవ్ హీరోగా గోపి గణేష్ తెరెక్కించనున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మించనున్నారు. తాజాగా విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచుతుంది. ఏదో వస్తువుని తీక్షణంగా చూస్తున్నట్టు కనిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

Spread the love