ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాల్సిందే : సుప్రీం

కాలేజీలు, యూనివర్సీటీల్లో చదివే విద్యార్థులకి ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాల్సిందేనని సుప్రీం కోర్ట్ తేల్చి చెప్పింది. ఫైనల్ ఇయర్ విద్యార్థినీ, విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండా, తదుపరి తరగతులకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమోట్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఆదేశాల మేరకు ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయరాదని వివరించింది. అయితే ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు యూజీసీ ప్రకటించిన సెప్టెంబరు 30 గడువును రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించవలసిన అవసరం లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని వాయిదా వేయవచ్చునని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది.