18 నుంచి రెండుపూటల బడులు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18 నుంచి రెండు పూటల స్కూల్స్ నిర్వహించాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది విద్యాసంవత్సరం చాలా వరకు రద్దు అయ్యింది. ఆన్లైన్ ద్వారానే విద్యార్థులు క్లాసులకు హాజరవుతున్నారు. 7 నుంచి 10 తరగతి విద్యార్థులకు మాత్రమే స్కూల్ కు వెళ్లే అవకాశం ఉన్నది.

ఒక పూట మాత్రమే స్కూల్ నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే, కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో జనవరి 18 నుంచి విద్యార్థులకు ఒక్కపూట కాకుండా రెండుపూటలా స్కూల్ నిర్వహించేలా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. పదోతరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

Spread the love