‘జీ జాంబీ’ రెండో లిరికల్ సాంగ్ ఎప్పుడంటే ?

మహిళా దర్శకురాలు దీపిక జాంబీస్ వైరస్ మీద సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన దీపిక సినిమా మేకింగ్ పట్ల ఆసక్తితో జాంబీస్ వైరస్ మీద ‘జీ జాంబీ’ సినిమా రూపొందించారు. ఆర్యన్ గౌర, దివ్య పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్ ను త్వరలో విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, తొలి పాటకు మంచి స్పందన వస్తోంది. ‘జీ జాంబీ’ చిత్రానికి వినోద్ కుమార్ (విన్ను) సంగీతం, రాంబాబు గోసాల లిరిక్స్ అందించిన పాటలు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. మంచి సంగీతంతోపాటు ఆడియన్స్ థ్రిల్ అయ్యే అనేక అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని చిత్ర బృందం చెబుతోంది.