ఏకంగా జవాన్ ఇంట్లోనే సెక్స్ రాకెట్

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ జవాన్ ఇంట్లోనే సెక్స్ రాకెట్ బట్టబయలు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మీరట్ లో ఓ జవాన్ ఇంటిని మూడు నెలల క్రితం భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చి ఓ ముఠా అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అప్పటి నుంచి ఈ హైటెక్ వ్యభిచారాన్ని రహస్యంగా సాగిస్తున్నారు. స్థానికులకు అనుమానం రావడంతో వారు మానవ అక్రమ రవాణా నిరోధక శాఖకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన అక్రమ రవాణా నిరోధక శాఖ అధికారులు సెక్స్ రాకెట్‌ గుట్టును రట్టు చేశారు. ఇద్దరు యువతులు(ఒకరు మైనర్), ఇద్దరు విటులతో పాటుగా హర్యానాకు చెందిన ఓ డ్యాన్సర్‌ను పట్టుకున్నారు. విటుల దగ్గర నుంచి రూ.2 వేలు లేదా రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. హర్యానా, ఢిల్లీని నుంచి యువతులను రప్పించడమే కాకుండా వారి వివరాలను ముందుగానే కస్టమర్ల వాట్సాప్‌కు పంపిస్తారని తెలిసింది.