కంగనా వివాదంపై శరద్‌ పవార్‌ స్పందన

బాలీవుడ్‌ హీరోయిన్ కంగనా రనౌత్‌ ఇల్లు కూల్చివేత బృహన్ ‌ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కంగనాపైర్ అయింది. అమెకి పలువురు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్‌ పవార్‌ స్పందించారు.

బృహన్ ‌ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) అధికారులు తీసుకున్న నిర్ణయమని ఇందులో మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నియమ, నిబంధనల ప్రకారమే బీఎంసీ అధికారులు ఆమె కార్యాలయం కూల్చివేత చేపట్టారని, దీనిలో రాష్ట్రప్రభుత్వం పాత్ర లేదని పేర్కొన్నారు.